Social 1080×1350 • Multi-page
08-11-2026 BREAKING NEWS 11:33 PM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్‌లో వైభవంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాలు.. – ముఖ్యఅతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని.

హుజూరాబాద్‌లో వైభవంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాలు.. – ముఖ్యఅతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని.
IMG-20261108-WA0168

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
​హుజూరాబాద్ :
హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాలు అత్యంత వైభవంగా, పండగ వాతావరణంలో జరిగాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు నేతృత్వంలో ఈ వేడుకలను నిర్వహించారు.

​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు వార్డుల్లో పర్యటించి, ఇందిరమ్మ పథక లబ్ధిదారులను కలిసి వారికి ఆత్మీయంగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లబ్ధిదారులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం వారితో కలిసి టపాసులు పేల్చి, స్వయంగా స్వీట్లు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వులు నింపడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి పేద కుటుంబంలో వెలుగులు నింపేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషన్, మేనేజర్ భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్లతో పాటు కౌన్సిలర్లు సునీత బాబు, భాస్కర్, సుమలత సుమన్, పుణ్య బాబు, వెంకటేశ్వర్లు, వెంకట్ నాయక్, బండ వెన్నెల నవీన్, మహమ్మద్ ఖలీద్ హుస్సేన్, శ్రీనివాస్, కొండ ప్రశాంతి మురళి, మొగిలి తదితరులు పాల్గొన్నారు.
​అలాగే టౌన్ ప్రెసిడెంట్ మేకల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ వార్డుల అధ్యక్షులు, వార్డు ఆఫీసర్లు, జవాన్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మరియు ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ రొంటాల సుహాసిని – మనోజ్ రావు గారు, చైర్పర్సన్ పురపాలక సంఘం హుజురాబాద్.


*దీపావళి శుభాకాంక్షలు*

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి గారు, జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు (సింగాపూర్) హుజురాబాద్.


శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ తాళ్లపల్లి స్వప్న – వెంకటేష్ గారు, గ్రా: సర్పంచ్ జూపాక, మండలం హుజురాబాద్.. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హుజురాబాద్.


శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ పెరుమాండ్ల హైమ బిక్షపతి గారు, గ్రా: కాట్రపల్లి సర్పంచ్, మండలం హుజురాబాద్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!