విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు జయన్న ఫౌండేషన్ చేయూత

—సింగాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వాటర్ బాటిళ్ల పంపిణీ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సింగాపూర్): విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమశిక్షణతో చదువుకోవాలని జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి సూచించారు. సింగాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫోన్ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఉత్తమ సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమని, పిల్లల్లో నైతిక విలువలు, సేవాభావం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ప్రతి విద్యార్థి రోజూ కనీసం నాలుగు లీటర్ల నీటిని తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు.
విద్యార్థుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన ఈ సేవా కార్యక్రమంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ నాంపల్లి శ్రీనివాస్ గారు 24 వ వార్డు కౌన్సిలర్ (బోర్నపల్లి), పురపాలక సంఘం హుజూరాబాద్.

