Social 1080×1350 • Multi-page
12-11-2026 BREAKING NEWS 09:38 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ క్లబ్ ఎన్నికల బరిలో దూసుకుపోతున్న పాత్రికేయులు. – కార్యదర్శి పదవిలో మల్లారెడ్డి! – ఎగ్జిక్యూట్ మెంబర్ బరిలో మరో ముగ్గురు సీనియర్ రిపోర్టర్లు

హుజురాబాద్ క్లబ్ ఎన్నికల బరిలో దూసుకుపోతున్న పాత్రికేయులు. – కార్యదర్శి పదవిలో మల్లారెడ్డి! – ఎగ్జిక్యూట్ మెంబర్ బరిలో మరో ముగ్గురు సీనియర్ రిపోర్టర్లు
IMG-20261112-WA0092

—రసవత్తరంగా క్లబ్ ఎన్నికలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ క్లబ్ కార్యవర్గ ఎన్నికలు నవంబర్ 15 న ఆదివారం జరగనున్నాయి.
326 ఓటర్లు ఉన్న ఈ క్లబ్ కు గత 10 ఏళ్ళు గా ఏకగ్రీవంగా నామినేటెడ్ పోస్టుల్లో నియామకం జరుగగా, ప్రస్తుతం ఈ సారి ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మొదట ఏకగ్రీవం కోసం సీనియర్ మెంబర్స్ వ్యూహం చేసినప్పటికీ సమీకరణ లు కలువక ఎన్నికలు అనివార్యం అయ్యాయి. దీంతో కార్యదర్శి పదవికి కట్కూరి మల్లారెడ్డి, మచ్చ నారాయణ రెడ్డి లు, ఉపాధ్యక్ష పదవికి పుల్లూరి ప్రభాకర్ రావు, సీనియర్ న్యాయవాదులు కంకనా ల విజయారెడ్డి, గౌరు సమ్మిరెడ్డి, సoయుక్త కార్యదర్శి గా మంద రమేష్ RK, శివనాథుని వేణు, కొమురవెల్లి హరి ప్రసాద్ లు, కోశాధికారి గా గర్రెపల్లి తడికల్ సీను, కొండ గణేష్ లు పోటిలో ఉన్నారు, ఇక ఈసీ మెంబర్ గా కేసిరెడ్డి నర్సింహారెడ్డి, గడ్డం ధర్మారెడ్డి, మాగంటి శ్రీధర్, విష్ణుదాసు గోపాల్ రావు, మేకల రాజిరెడ్డి, బత్తుల సమ్మయ్య, జున్నోజు రాజేందర్, పోనుగంటి శ్రవణ్ కుమార్, ఆకినపల్లి అనీల్ కుమార్, గోలీ సురేష్ కోలే కల్యాణ్ రావు, దొనకొండ సత్యనారాయణ, జిల్లేల భాస్కర్ రెడ్డి, ఈదులకంటి రవీందర్ రెడ్డి, పుల్లూరి శ్రీకాంత్, శనిగరం కోoరయ్య, వేముల మనోహర్, మొలుగురి సదయ్య, పలకల శ్రీనివాస్ రెడ్డి ఎండీ మతీన్ లు ఉన్నారు. కాగా, వ్యాపార, రాజకీయ రంగం నుండి కీలకం అవుతుందని భావించిన ఈ సారి మాత్రం పాత్రికేయుల పాత్ర కీలకంగా మారింది.

–పాత్రికేయులే కీలకం

ఈ ఎన్నికల్లో క్లబ్ కార్యదర్శి గా పోటీ చేస్తున్న కట్కూరి మల్లారెడ్డి 35 ఏళ్లు గా పత్రిక రంగంలో పనిచేస్తున్నారు. ఇటివల రాజాపల్లి గ్రామానికి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. గతం లో ప్రభుత్వ ఎస్సీ కార్పొరేషన్ డిపార్ట్ మెంట్ లో డీ ఈ గా రిటైర్డ్ అయ్యారు. కాగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లుగా సీనియర్ పాత్రికేయులు కేసిరెడ్డి నరసింహారెడ్డి గడ్డం ధర్మారెడ్డి ఇద్దరూ పోటీ చేస్తున్నారు. మరో రిటైర్డ్ ఉద్యోగి, హుజురాబాద్ క్లబ్ సీనియర్ సభ్యులు, సీనియర్ కళాకారుడు, కళాకారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, రిటైర్ ఉద్యోగ సంఘం మాజీ కార్యదర్శి, మంచి వ్యాఖ్యాత, తెలంగాణ డెమోక్రటిక్ సీనియర్ సిటిజన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, బ్రాహ్మణ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగిన నేనున్నానంటూ ఉచితంగా సేవలు అందించే వ్యక్తి, ఉద్యమకారుడు, అజాతశత్రువు ,ని గర్వి, డాక్టర్. విష్ణుదాసు. గోపాల్ రావు
కూడా బరిలో నిలిచారు.
ఇందులో గడ్డం ధర్మారెడ్డి ఆంధ్రజ్యోతి ఇన్చార్జిగా ఉన్నారు. ఆయనకు అందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరో పాత్రికేయుడు మంచి మనిషి అజాత శత్రువు నిగర్వి కేసిరెడ్డి నరసింహారెడ్డి, పాత్రికేయ రంగంలో 35 ఏళ్లుగా పనిచేస్తున్నారు. 2006 నుండి,4 సార్లు కౌన్సిలర్ గా వారి సతీమణి ని బరిలో నిలుపుతూ ఎన్నికవుతూ హుజురాబాద్ మున్సిపల్ పాలక వర్గం లో రికార్డులు సృష్టించారు. కాగా ఈ ఎన్నికల్లో పాత్రికేయులు చక్రం తిప్పుతున్నారు. మల్లారెడ్డి, నరసింహారెడ్డి, ధర్మారెడ్డి, గోపాల్ రావు లకు అధిక సంఖ్యలో సభ్యులు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సభ్యులు క్లబ్ కార్యవర్గంలో ఉంటే సమన్వయం బాగుంటుందని, క్లబ్ కార్యక్రమాలకు ప్రచారం లభించడంతో పాటు, బలమైన శక్తిగ కూడా వీరికి మద్దతునిస్తున్నారు.
క్లబ్ కార్యక్రమాల్లో లోకల్ క్లబ్ సభ్యులు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఈ సారి ప్రత్యక్షంగా జరుగుతున్న ఎన్నికల్లో పాత్రికేయులు పాత్ర పెద్దది చెప్పవచ్చును.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ నాంపల్లి శ్రీనివాస్ గారు 24 వ వార్డు కౌన్సిలర్ (బోర్నపల్లి), పురపాలక సంఘం హుజూరాబాద్.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!