Social 1080×1350 • Multi-page
12-11-2026 BREAKING NEWS 10:51 PM
swarnodayam.com
Telugu Daily News

నిజాయితీని చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు

నిజాయితీని చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ప్రజాసేవలోనే కాకుండా, నిజాయితీలో కూడా తామున్నామని నిరూపించుకున్నారు హుజురాబాద్ పోలీసులు. వివరాలలోకి వెళితే… గురువారం హుజురాబాద్ బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, హోంగార్డులు శ్రీనివాస్ , సంపత్ లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పర్సును పోగొట్టుకున్నాడు. విధులు నిర్వహిస్తున్న వారికి ఆ పర్సు కనిపించడంతో నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్సై కొత్తపల్లి రవికి అందించారు. ఆయన పర్సు లోని వివరాల ప్రకారం హుజురాబాద్ కు చెందిన ఎండి అంకుషావలిగా గుర్తించారు. పోలీసుల పిలుపుతో పోలీస్ స్టేషన్కు వచ్చిన అంకుశావళి తన పర్సులో విలువైన పాన్ కార్డు, డెబిట్ కార్డ్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డ్ ఒరిజినల్ అలాగే ఉండడం చూసి సంతోషించి నిజాయితీతో విధులు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, హోంగార్డులు శ్రీనివాస్, సంపత్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సై కొత్తపల్లి రవి వారిని అభినందించారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ నాంపల్లి శ్రీనివాస్ గారు 24 వ వార్డు కౌన్సిలర్ (బోర్నపల్లి), పురపాలక సంఘం హుజూరాబాద్.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!