Social 1080×1350 • Multi-page
12-11-2026 BREAKING NEWS 11:25 PM
swarnodayam.com
Telugu Daily News

ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి : ఆర్డీవో జల కుమారి నాయక్వాడి

ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి : ఆర్డీవో జల కుమారి నాయక్వాడి
IMG-20261112-WA0098

—కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హుజురాబాద్‌లో ప్రత్యేక సమీక్షా సమావేశం

—తాగునీటి సరఫరా, ప్రభుత్వ అభివృద్ధి పథకాల అమలుపై అధికారులకు, సర్పంచులకు దిశానిర్దేశం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజురాబాద్: ​ఎల్‌నినో ప్రభావం కారణంగా రాబోయే రోజుల్లో తలెత్తే నీటి ఎద్దడి, వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో), హుజురాబాద్ మండల ప్రజా పరిషత్తు ప్రత్యేక అధికారి శ్రీమతి జల కుమారి నాయక్వాడి అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, గురువారం హుజురాబాద్ మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

​తాగునీటి వనరుల సమర్థ వినియోగం:

మొదటగా ఎల్‌నినో పరిస్థితులపై నిర్వహించిన సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సరఫరా మౌలిక సదుపాయాలన్నీ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని సూచించారు. బోర్లు, పైపులైన్లు, ట్యాంకుల ప్రస్తుత స్థితిగతులను సమగ్రంగా అంచనా వేసి, ఎక్కడైనా మరమ్మతులు అవసరమైతే తక్షణమే పూర్తి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను వృథా చేయకుండా వివేకవంతంగా, సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు స్పష్టం చేశారు.

​45 రోజుల మండల పరిషత్తు సమీక్ష:

ఎల్‌నినో సమావేశం అనంతరం, ప్రతి 45 రోజులకు ఒకసారి నిర్వహించే మండల ప్రజా పరిషత్తు (ఎంపీపీ) సాధారణ సమీక్షా సమావేశం ఆర్డీవో జల కుమారి నాయక్వాడి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మండలంలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ఆమె శాఖల వారీగా సమీక్షించారు.

​ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన, మిషన్ భగీరథ మరియు ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొని, ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, తాగునీటి సరఫరా ప్రణాళికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ / నివేదికల ద్వారా తగు సూచనలు అందించారు.

​ఈ సమీక్షా సమావేశంలో హుజురాబాద్ ఎంపీడీవో సునీత, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు


&&లోకల్ యాడ్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ నాంపల్లి శ్రీనివాస్ గారు 24 వ వార్డు కౌన్సిలర్ (బోర్నపల్లి), పురపాలక సంఘం హుజూరాబాద్.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!