Social 1080×1350 • Multi-page
13-11-2026 BREAKING NEWS 03:27 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ క్లబ్ అభివృద్ధిలో నా సేవలను గుర్తించి ఆదరించండి: ఈసీ మెంబర్ అభ్యర్థి పుల్లూరి శ్రీకాంత్​ఈ నెల 15న ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు క్లబ్ ఎన్నికలు​సీరియల్ నెంబర్ 17 పై ఓటు వేసి గెలిపించాలని సభ్యులకు విజ్ఞప్తి. – ​కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆదేశాలతో క్లబ్ పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించానని వెల్లడి.

హుజురాబాద్ క్లబ్ అభివృద్ధిలో నా సేవలను గుర్తించి ఆదరించండి: ఈసీ మెంబర్ అభ్యర్థి పుల్లూరి శ్రీకాంత్​ఈ నెల 15న ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు క్లబ్ ఎన్నికలు​సీరియల్ నెంబర్ 17 పై ఓటు వేసి గెలిపించాలని సభ్యులకు విజ్ఞప్తి. – ​కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆదేశాలతో క్లబ్ పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించానని వెల్లడి.
IMG-20261113-WA0066

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజురాబాద్: ఈ నెల 15వ తేదీన జరగనున్న హుజురాబాద్ క్లబ్ ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) మెంబర్ అభ్యర్థిగా (సీరియల్ నెంబర్ – 17) బరిలో నిలిచిన పుల్లూరి శ్రీకాంత్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. క్లబ్ అభివృద్ధి, పునరుద్ధరణలో తాను గతంలో అందించిన నిస్వార్థ సేవలను గుర్తించి, 15వ తేదీన ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు జరగనున్న పోలింగ్‌లో తనకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆయన క్లబ్ సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు.

​ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపార రంగంతో పాటు ప్రజా, సామాజిక సేవలో చురుగ్గా కొనసాగుతున్నానని తెలిపారు. 2026 మున్సిపల్ ఎన్నికల్లో 26వ వార్డు కౌన్సిలర్‌గా ప్రజల ఆశీస్సులతో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ, నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ హుజురాబాద్ రాజకీయ, ప్రజాసేవా రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నానని పేర్కొన్నారు.
​క్లబ్ పునరుద్ధరణలో కీలక పాత్ర:
హుజురాబాద్ క్లబ్ అభివృద్ధి, పునరుద్ధరణలో తాను ఎంతో నిబద్ధతతో, ధైర్యంతో పనిచేశానని శ్రీకాంత్ గుర్తు చేసుకున్నారు. క్లబ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు సూచనలు, ఆదేశాల మేరకు 2014 నుండి 2020లో కరోనా పరిస్థితులు ఏర్పడే వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ క్లబ్ పురోగతి కోసం అహర్నిశలు కృషి చేశానని తెలిపారు. క్లబ్‌కు నూతనోత్సాహం తీసుకురావాలనే సంకల్పంతో కెప్టెన్ లక్ష్మీకాంతరావు తనకు అప్పగించిన కొత్త సభ్యత్వ నమోదు బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించి, పట్టణంలోని పలువురు ప్రముఖులను, వ్యాపారులను క్లబ్ సభ్యులుగా చేర్పించానని వివరించారు.

సాంకేతిక సమస్యల పరిష్కారానికి కృషి:
క్లబ్ తీవ్ర ఒత్తిళ్లలో, సాంకేతిక సమస్యల్లో ఉన్న సమయంలో కెప్టెన్ అనుమతితో వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అధికారులతో చర్చించి, అవసరమైన అనుమతులు సాధించడంలో తన వంతు పాత్ర పోషించానని తెలిపారు. తన వ్యక్తిగత సమయాన్ని, శ్రమను వెచ్చించి క్లబ్ పునరుద్ధరణకు సహకరించానని చెప్పారు. నేడు హుజురాబాద్ క్లబ్ పట్టణానికే ప్రత్యేక వన్నె తెస్తూ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడం వెనుక కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు దూరదృష్టి, పట్టుదల ఎంతో గొప్పవని కొనియాడారు.
​ఒక సేవకుడిగా, వ్యాపారిగా ఉన్న అనుభవంతో భవిష్యత్తులోనూ క్లబ్ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి పూర్తి సమయం కేటాయిస్తూ అంకితభావంతో పనిచేసేందుకు ఈసీ మెంబర్‌గా (S.NO – 17) మీ ముందుకు వస్తున్నానని తెలిపారు. కావున, ఈ నెల 15న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల లోపు జరిగే ఎన్నికల్లో సభ్యులందరూ విధిగా పాల్గొని, తమ అమూల్యమైన ఓటును సీరియల్ నెంబర్ 17 పై వేసి తనను ఆశీర్వదించి గెలిపించాలని పుల్లూరి శ్రీకాంత్ కోరారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!