Telugu Daily News
దుబ్బ మల్లన్న కళ్యాణ, జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన వొడితల ప్రణవ్..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో వచ్చే నెల నుండి జరిగే మల్లికార్జునస్వామి కళ్యాణం, జాతరకు సంబంధించి పోస్టర్ ను ప్రణవ్ ఆవిష్కరించారు. ఎంతో మహిమ కలిగిన ఈ ఆలయంలో జరిగే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని,జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేయాలని కమిటీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దుబ్బ మల్లన్న చైర్మెన్ రవీందర్, కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


