విద్యా సంస్థల్లో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే బాలల దినోత్సవం వేడుకలు ముందస్తుగా శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో స్వయం పాలన దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు. పిల్లలే ఉపాధ్యాయులుగా మారి పిల్లలకు పాఠాలు బోధించారు. అంతకుముందు చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన అమోఘమైన సేవల గురించి ఉపాధ్యాయులు పిల్లలకు వివరించారు.

విజ్ఞాన్ నెక్స్ట్‌జెన్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం – స్వయంపాలన దినోత్సవ వేడుకలు!
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విజ్ఞాన్ నెక్స్ట్‌జెన్ స్కూల్‌లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వయంపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా, వివిధ బాధ్యతలను స్వీకరించి పాఠశాల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానం, ఆత్మవిశ్వాసం మరియు పరిపాలనా నైపుణ్యాలను పెంపొందించడమే స్వయంపాలన దినోత్సవ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అలాగే నేటి
విద్యార్థులే రేపటి నాయకులు – నాయకత్వానికి నేటి నుంచే నాంది! పలకాలని సూచించారు.
విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన
విద్యార్థి ఉపాధ్యాయులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, స్టూడెంట్ ప్రిన్సిపాల్ సంజన, వైస్ ప్రిన్సిపాల్ మహాలక్ష్మి, ఒకరోజు విద్యార్థి ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

