సగర సంఘం రాష్ట్ర కోశాధికారిగా కానిగంటి శ్రీనివాస్ సగర

—నియామకం ప్రకటన చేసిన రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి
–రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపిన కానిగంటి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారిగా కరీంనగర్ జిల్లా కనుకుల గిద్ద గ్రామానికి చెందిన కానుగంటి శ్రీనివాస్ సగర నియమితులయ్యారు. రాష్ట్ర సగర సంఘం కార్యవర్గం తీర్మానం ఆమోదం ప్రకారం రాష్ట్ర కోశాధికారిగా శ్రీనివాస్ సగర ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక సత్యం సగర ప్రకటన చేశారు. గత అనేక సంవత్సరాలుగా సగరకుల ప్రయోజనాల కోసం కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శిగా పనిచేశారు. ఈ సందర్భంగా కానిగంటి శ్రీనివాస్ సగర మాట్లాడుతూ కుల హక్కుల సాధన కోసం అనేక సంవత్సరాలుగా తాను సేవ చేస్తూ వస్తున్నానని, రాష్ట్ర కోశాధికారిగా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే అవకాశం వచ్చినందుకు సంతోషపడుతున్నానని తెలిపారు. ఈ బాధ్యతలను నాకు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర, రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, రాష్ట్ర ముఖ్య సలహాదారులు ఆర్. బి ఆంజనేయులు సగర లతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, అన్ని జిల్లాల అధ్యక్షులు నాయకులకు, సంగం సీనియర్లకు ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా సగర సంఘం నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర నాయకత్వం తనకు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత సేవ చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.

