హుజూరాబాద్ క్లబ్ ఎన్నికల సమరం : ఉత్కంఠభరితంగా సాగుతున్న పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు.. ఇప్పటికే 50 శాతం పూర్తయిన ఓటింగ్.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పట్టణంలోని ప్రతిష్టాత్మక హుజూరాబాద్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. క్లబ్‌లోని 330 మంది సభ్యుల (ఓటర్ల) తీర్పును తేల్చే పోలింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం నుంచి అత్యంత ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఉదయం నుంచే సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు ఉత్సాహంగా తరలివస్తున్నారు.








ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు:
ఈ ఎన్నికల్లో పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్లబ్ స్థాపన నుంచి నేటి వరకు దాని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంతారావు, స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వోడితెల సతీష్ బాబు, ఆయన కుమారుడు ఇంద్రనీల్, ఎన్ఎస్ఆర్ ఇండస్ట్రీస్ అధినేత నాయినేని సంపత్ రావు, సీడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ ఐరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి, కౌన్సిలర్లు వర్ధినేని రవీందర్రావు, గందే శ్రీనివాస్, పత్రికా ప్రముఖులు గడ్డం రాజిరెడ్డి, కట్కూరి మల్లారెడ్డి, కేశిరెడ్డి నరసింహారెడ్డి, కామిని రవీందర్, గడ్డం ధర్మారెడ్డి తదితరులు పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. వీరితో పాటు పట్టణంలోని పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, న్యాయవాదులు, వైద్యులు, ఇతర క్లబ్ సభ్యులు బారులు తీరి ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములయ్యారు.
పకడ్బందీగా ఏర్పాట్లు:
ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారదర్శకంగా సాగుతోంది. పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి నిమిషం వరకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
సాయంత్రం ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ:
పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి, సాయంత్రమే ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. క్లబ్ కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, సహాయ కార్యదర్శి, కోశాధికారి, ఇతర కార్యవర్గ పదవుల కోసం పోటీ హోరాహోరీగా సాగుతుండటంతో, ఈసారి విజయం ఎవరిని వరిస్తుందన్నది పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది. సాయంత్రం వెలువడనున్న తుది ఫలితాల కోసం సభ్యులతో పాటు స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

క్లబ్ వద్ద ఓటర్ల కోలాహలం.. అభ్యర్థుల ప్రచారం…

