హుజురాబాద్‌లో 17న ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ మోహన్ చందు సేవలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (నవంబర్ 15): స్థానిక సురక్ష హాస్పిటల్స్ నందు ఈ నెల 17వ తేదీ మంగళవారం నాడు అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ (Apollo Reach NSR) హాస్పిటల్స్ ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ మోహన్ చందు ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నారు.
మంగళవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆయన హుజురాబాద్‌లో అందుబాటులో ఉంటారని ఆసుపత్రి నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, మూత్రం ఆపుకోలేకపోవడం, మూత్రంలో మంట, కిడ్నీ స్టోన్స్ (మూత్రపిండాల్లో రాళ్లు) మరియు ప్రొస్టేట్ గ్రంధి సమస్యలతో బాధపడుతున్న రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అలాగే, శస్త్రచికిత్సలు (ఆపరేషన్స్) అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచిత వైద్య సదుపాయం కల్పించబడుతుందని పేర్కొన్నారు. ముందస్తు అపాయింట్మెంట్ మరియు ఇతర వివరాల కోసం 8341133293 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

