Social 1080×1350 • Multi-page
15-11-2026 BREAKING NEWS 11:15 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ క్లబ్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా మల్లారెడ్డి, ఉపాధ్యక్షులుగా ప్రభాకర్ రావు, సహాయ కార్యదర్శిగా వేణుగోపాల్, కోశాధికారిగా శ్రీనివాస్ విజయం.. – తీవ్ర ఉత్కంఠ రేపిన క్లబ్ ఎన్నికలు

హుజురాబాద్ క్లబ్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా మల్లారెడ్డి, ఉపాధ్యక్షులుగా ప్రభాకర్ రావు, సహాయ కార్యదర్శిగా వేణుగోపాల్, కోశాధికారిగా శ్రీనివాస్ విజయం.. – తీవ్ర ఉత్కంఠ రేపిన క్లబ్ ఎన్నికలు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ క్లబ్ కార్యవర్గానికి ఆదివారం హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో కార్యదర్శిగా కట్కూరి మల్లారెడ్డి 45 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారని ఎన్నికల అధికారులు రామ్ కిషన్ రాజు, సంజీవరెడ్డి, వేణుమాధవ్ లు తెలిపారు. ఉపాధ్యక్షులుగా పుల్లూరి ప్రభాకర్ రావు 199 ఓట్లు సాధించి కంకణాల విజయ రెడ్డి పై126 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. సహాయ కార్యదర్శిగా శివనాధుని వేణుగోపాల్ 174 ఓట్లు సాధించి మంద రమేష్ పై 62 ఓట్లతో విజయం సాధించారు. కోశాధికారిగా గర్రెపల్లి శ్రీనివాస్ కొండ గణేష్ పై 38 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పుల్లూరి ప్రభాకర్ రావు, కట్కూరి మల్లారెడ్డి..

కోశాధికారిగా ఎన్నికైన గర్రెపల్లి శ్రీనివాస్

అలాగే కార్యవర్గ సభ్యులుగా..(ఈసీ) విజేతలు వీరే!! : హుజురాబాద్ క్లబ్ కు జరిగిన పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల అధికారులు పోలైన 308 ఓట్లను కట్టలు కట్టి ఏడు రౌండ్ గా విభజించారు. పోలైన ఓట్లలో రెండు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఏడు రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత విజేతలుగా 9 మందిని ప్రకటించారు.

  1. గడ్డం ధర్మారెడ్డి..(207)
  2. కేశిరెడ్డి నరసింహారెడ్డి.. (206)
  3. పుల్లూరు శ్రీకాంత్.. (195)
  4. మ్యాకల రాజిరెడ్డి.. (175)
  5. గోలి సురేష్ .. (173)
  6. పొనగంటి శ్రవణ్ కుమార్.. (133)
  7. ఆకినపల్లి అనిల్ కుమార్.. (122)
  8. దొనకొండ సత్యనారాయణ రెడ్డి.. (120)లు విజయం సాధించారు. కాగా మాగంటి శ్రీధర్, కోలె కళ్యాణ్ రావులకు సమానమైన ఓట్లు(110) చొప్పున రావడంతో తిరిగి రీకౌంటింగ్ చేస్తున్నారు. టాస్క్ ఇద్దరు ఒప్పుకుంటారా లేదా ఇద్దరినీ కలిపి ఈసీ సభ్యులుగా ప్రకటిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

ఓటమిపాలైన అధికార పార్టీ సానుభూతిపరులు..!

హుజురాబాద్ క్లబ్ ఎన్నికలు ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా జరగాల్సి ఉండగా.. రెండు వర్గాలుగా రెండు పార్టీలకు సానుభూతిపరులుగా ప్రకటించుకొని ఎన్నికల బరిలో పలువురు దిగడంతో చివరికి అధికార పార్టీ సానుభూతిపరులుగా చెప్పుకున్న వారు ఓటమిపాలు చెందడం ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు గెలుపొందడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఆది నుండి ప్రతిపక్ష పార్టీ పై చేయిగా మారడం ఈ ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అదే పార్టీకి చెందిన క్లబ్బు అధ్యక్షుడు మాజీ ఎంపీ వోడితెల లక్ష్మీ కాంతారావు, అతని తనయుడు మాజీ ఎమ్మెల్యే ఓడితెల సతీష్ బాబు, అతని తనయుడు ఇంద్రనిల్ తదితర ప్రముఖులు ఎన్నికల్లో ఓటు వేయగా అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు, అతని తండ్రి శ్రీనివాస రావు, పెద్దనాన్న కిషన్ రావు తదితరులు ఓటింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే అధికార, ప్రతిపక్ష నేతలు పోటాపోటీగా బాహాటంగా ప్రచారం చేయనప్పటికీ తమ అనుచరులకి మౌఖికంగా ఆయా పార్టీల సానుభూతిపరులకు ఓట్లు వేయాలని చెప్పినట్లు ప్రచారం జరిగింది. పోటీదారులు రెండు గ్రూపులుగా విడిపోయి ఎన్నికల్లో ప్రచారం చేసి అధికార పార్టీ సానుభూతిపరులపై ప్రతిపక్ష పార్టీ నేతలు భారీ మెజారిటీతో గెలుపొందడం హుజురాబాద్ లోనే కాక జిల్లాలోనే హార్ట్ టాపిక్ గా మారింది.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!