Social 1080×1350 • Multi-page
16-11-2026 BREAKING NEWS 09:34 PM
swarnodayam.com
Telugu Daily News

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG-20261116-WA0046

—ప్రతాప సాయి గార్డెన్‌లో ఘనంగా ‘చేయూత’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం

—లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజూరాబాద్, నవంబర్ 16: నిరుపేదలు, వృద్ధులు, వితంతువులు మరియు దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘చేయూత’ పింఛన్లను అందిస్తోందని హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రతాప సాయి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. పింఛన్ సొమ్ము నిరుపేదల కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి మున్సిపాలిటీ తరఫున ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జల కుమారి, మున్సిపల్ కమిషనర్ బి కిషన్, ఎంఆర్ఓ జే నరేందర్, ఎంపీడీఓ సునీత లతో పాటు స్థానిక సర్పంచులు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!