ఆల్ఫోర్స్ జీనియస్ లో స్వయం పరిపాలన దినోత్సవ సంబరాలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలలో భాగంగా సోమవారం రోజున స్వయం పరిపాలన దినోత్సవాన్ని అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బాలలే దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులని, ప్రతి చిన్నారిలోనూ అపారమైన ప్రతిభ, సృజనాత్మకత దాగి ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలను పెంపొందించడం పాఠశాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. పిల్లల కలలను సాకారం చేయడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
వేడుకల్లో భాగంగా స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు స్టూడెంట్ టీచర్లుగా పాఠ్యాంశాలను బోధించారు. తదనంతరం విద్యార్థుల కోసం ప్రత్యేక ఆటలు, పాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నిర్వహించారు. విద్యార్థుల కేరింతలు, చిరునవ్వులతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. బాలల ఆనందమే పాఠశాల విజయానికి నిజమైన ప్రతిబింబమని, ప్రతి విద్యార్థి విద్యాపరంగానే కాకుండా అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించడమే ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాల సంకల్పమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
