Social 1080×1350 • Multi-page
17-11-2026 BREAKING NEWS 07:28 PM
swarnodayam.com
Telugu Daily News

మాజీ మంత్రి, మాజీ ఎంపీ కెప్టెన్ వి. లక్ష్మీకాంతారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎల్.వి. అర్జున్

మాజీ మంత్రి, మాజీ ఎంపీ కెప్టెన్ వి. లక్ష్మీకాంతారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎల్.వి. అర్జున్
IMG-20261117-WA0148

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంతారావు 89వ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.వి. అర్జున్ మంగళవారం ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
​హుజురాబాద్ నుంచి హనుమకొండ రోడ్డులోని కెప్టెన్ నివాసానికి వెళ్లిన ఎల్.వి. అర్జున్, ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఆశీర్వాదం తీసుకున్నారు.

​ఈ సందర్భంగా ఎల్.వి. అర్జున్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు తెలంగాణ సమాజానికి, హుజురాబాద్, జిల్లా ప్రాంత అభివృద్ధికి అందించిన విశిష్ట సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజకీయాల్లో నిబద్ధతకు, విలువలకు ఆయన నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజా జీవితంలో ఆయన మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో తెలంగాణ యూత్ ఫోర్స్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!