Social 1080×1350 • Multi-page
19-11-2026 BREAKING NEWS 07:43 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా జయన్న ఫౌండేషన్. – విద్యార్థులకు ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్సుల పంపిణీ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా జయన్న ఫౌండేషన్. – విద్యార్థులకు ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్సుల పంపిణీ
IMG-20261119-WA0117

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించే విధంగా జయన్న ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని, ఫౌండేషన్ ద్వారా చేయూత పొందిన విద్యార్థిని విద్యార్థులు వారి లక్ష్యాన్ని చేరుకోవాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొoటాల సుహాసిని అన్నారు.

గురువారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్ ల పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ సుహాసిని మాట్లాడుతూ….ఆర్థికంగా వెనుకబడిన తల్లిదండ్రుల పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తారని వారికి ప్రభుత్వం నుండి కాకుండా జయన్న ఫౌండేషన్ ద్వారా మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జయన్న ఫౌండేషన్ అధినేతలు గుడిపాటి సరిత, గుడిపాటి జయపాల్ రెడ్డి ల ఔదార్యం ఇతరులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం మాజీ ఎంపిటిసి గుడిపాటి సరిత మాట్లాడుతూ…
పేద ప్రజల పిల్లలకు విద్యారంగంలో సదుపాయాలు కల్పించడం ద్వారా వారిని ప్రోత్సహించినట్లు అవుతుందని, అందుకే మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూత నందిస్తున్నామని తెలిపారు.

అనంతరం జయన్న ఫౌండేషన్ అధినేత గుడిపాటి జయపాల్ రెడ్డి మాట్లాడుతూ….
విద్య, వైద్య రంగాల్లో వంద శాతం అండగా నిలుస్తామని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేద విద్యార్థుల విద్య, ఆరోగ్య వికాసానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేసే సదుద్దేశంతో వాటర్ ప్లాంట్లు, మరుగుదొడ్ల మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు. అత్యవసర సమయాల్లో ఉచిత అంబులెన్స్ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ విద్యార్థినికి హైదరాబాద్‌లో పూర్తిస్థాయి చికిత్స చేయించగా, ఆమె కోలుకుని పదో తరగతిలో 580 మార్కులు సాధించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన తెలిపారు.

—విద్యార్థుల ఇబ్బందులకు స్పందించిన చైర్ పర్సన్ సుహాసిని
ప్రభుత్వ పాఠశాలలో రాగి జావ త్రాగడానికి సరైన బౌల్స్ బాటిల్స్ లేకుండా ఇబ్బంది పడుతున్న పిల్లల దుస్థితిని చూసి వెంటనే స్పందించిన హుజురాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ సుహాసిని పిల్లలందరికీ సొంత డబ్బులతో స్టీల్ గ్లాసులను పంపిణీ చేశారు. భవిష్యత్తులోనూ పాఠశాల అవసరాలకు ముందుండి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పిల్లలకు మధ్యాహ్న భోజనంను వడ్డించారు.
​ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోయల్‌కార్ భారతి, మహమ్మద్ ఖలీక్ హుస్సేన్, గోస్కుల రాజ్ కుమార్, పాఠశాల హెచ్ఎం రాధిక, రిటైర్డ్ హెచ్ఎం వేల్పుల రత్నం, విజయలత, ఝాన్సీ ప్రసూన, సిఆర్పిలు అమరేందర్, దామోదరచారి తదితరులు పాల్గొన్నారు
.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!