Social 1080×1350 • Multi-page
20-11-2026 BREAKING NEWS 11:02 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన..- హాజరైన ప్రముఖులు.

ఘనంగా శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన..- హాజరైన ప్రముఖులు.
IMG-20261120-WA0142

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం సాంప్రదాయ బద్ధంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవోపేతంగా జరిగింది. హుజురాబాద్ పట్టణ శివారులోని బోర్నపల్లి రోడ్ లో నూతనంగా నిర్మించిన గణపతి ఆలయంలో సుబ్రహ్మణ్య మఠం స్వామీజీ డాక్టర్ విద్యా ప్రసన్న తీర్థ స్వామి మార్గదర్శకంలో విగ్రహ ప్రతిష్టాపనతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పందిళ్ళ భాస్కర్ శర్మతో పాటు పలువురు వేద పండితులు శాస్త్రోత్తంగా దేవతా మూర్తికి నేత్రోన్మిలనం, దిష్టికుంభం పంచగవ్య పంచావృతాభిషేకం పూర్ణాహుతి మంత్రపుష్పం హారతి 108 కలశాలతో ధ్వజస్తంభ అభిషేకం నిర్వహించారు ప్రత్యేక పూజలు అనంతరం లక్ష్మీ గణపతి దైవదర్శనాన్ని భక్తులకు కల్పించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదo తోపాటు అన్నప్రసాద వితరణ జరిగింది.

—ప్రత్యేక పూజలల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఇన్చార్జి ప్రణవ్ బాబు

శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు జరిపారు. కళశాల నీటితో ధ్వజస్తంభం పై పోశారు. హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం వద్ద అగ్నిగుండం చుట్టూ ప్రదక్షణ నిర్వహించి వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి , ప్రణవ్ బాబులు దేవత మూర్తి దర్శనం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డీవో నాయకుల జల కుమారి, మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని, తాసిల్దార్ జక్కని నరేందర్, కమిషనర్ బండి కిషన్, కౌన్సిలర్లు, లక్ష్మీ గణపతి దేవాలయం అధ్యక్షులు దొంత రమేష్, ప్రధాన కార్యదర్శి అంగిరక ప్రసాద్, కోశాధికారి శనీగరపు నరేందర్, మున్సిపల్ కౌన్సిలర్లు వజ్జపల్లి వెంకటేశ్వర్లు, నాంపల్లి శ్రీనివాస్, వర్దినేని రవీందర్ రావు, చందమల్ల పుణ్య బాబు, ఇతర మున్సిపల్ కౌన్సిలర్లు, దేవస్థాన కమిటీ సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్, కొండ గణేష్, భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాల్గొన్నారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!