Social 1080×1350 • Multi-page
21-11-2026 BREAKING NEWS 06:22 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ వాసుదేవరెడ్డి

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ వాసుదేవరెడ్డి
Oplus_16908288

—పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్న నూతన సూపరింటెండెంట్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజురాబాద్, నవంబర్ 21: హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నూతన ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా సీనియర్ వైద్యులు డాక్టర్ వాసుదేవరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్) డాక్టర్ కృష్ణప్రసాద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం డాక్టర్ వాసుదేవరెడ్డి శనివారం ఆసుపత్రిలో ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు.

​ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య బృందం మరియు సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

​బాధ్యతల స్వీకరణ అనంతరం డాక్టర్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన డీసీహెచ్ కృష్ణప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఆసుపత్రికి మరింత మంచి పేరు తీసుకురావాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రసాద్, పి శ్రీకాంత్‌రెడ్డితో పాటు ఆసుపత్రి నర్సింగ్ అధికారులు, పారామెడికల్ మరియు ఇతర వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!