Social 1080×1350 • Multi-page
21-11-2026 BREAKING NEWS 06:49 PM
swarnodayam.com
Telugu Daily News

రామగుండం, ఖమ్మంలో కొత్త వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలి.. -సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ సంజయ్ జాజులకు కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ విజ్ఞప్తి

రామగుండం, ఖమ్మంలో కొత్త వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలి.. -సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ సంజయ్ జాజులకు కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ విజ్ఞప్తి
IMG-20261121-WA0089

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్ : మల్టీ జోన్-1 పరిధిలోని రామగుండంలో కాళేశ్వరం జోన్ వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ (JC) కార్యాలయాన్ని, ఖమ్మంలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి అదనంగా జాయింట్ కమిషనర్ కార్యాలయాన్ని వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజులకు విజ్ఞప్తి చేశారు.

​ఉద్యోగుల ఇబ్బందులు, ఆదాయ పెంపుదల:

ఈ సందర్భంగా ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కాళేశ్వరం జోన్‌కు సంబంధించిన సర్కిల్ కార్యాలయాల ఉద్యోగులు మూడు వేర్వేరు డివిజన్ల జాయింట్ కమిషనర్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సర్కిళ్లను కలుపుతూ రామగుండంలో కొత్తగా జాయింట్ కమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే ఉద్యోగులకు, వ్యాపారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అలాగే, ఖమ్మం జిల్లాలో వాణిజ్య కార్యకలాపాలు భారీగా జరుగుతున్నాయని, అక్కడి నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున పన్ను ఆదాయం సమకూరుతోందని తెలిపారు. ఖమ్మంలో కొత్తగా జేసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అధికారిని నియమిస్తే ప్రభుత్వ ఖజానాకు మరింత రెవెన్యూ పెరగడంతో పాటు మల్టీ జోన్-1 ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

​కమిషనర్ రఘునందన్ రావు చొరవతో రికార్డు స్థాయి జీఎస్టీ:

ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నూతనంగా వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్ కార్యాలయాలను ఏర్పాటు చేసి అధికారులను నియమించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రెవెన్యూ (వాణిజ్య పన్నులు, ఎక్సైజ్) ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఎం. రఘునందన్ రావు తీసుకున్న ప్రత్యేక చొరవతో నూతన జేసీ కార్యాలయాలతో పాటు 25 కొత్త సీటీఓ (CTO) కార్యాలయాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. శాఖలో చేపట్టిన పునర్వ్యవస్థీకరణ (రీ-ఆర్గనైజింగ్) వల్ల పన్ను వసూళ్లు వేగవంతమై, జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. రఘునందన్ రావు హయాంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు లభించాయని, శాఖాపరంగా ఉద్యోగులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని ముజాహిద్ హుస్సేన్ కొనియాడారు. ఇదే తరహాలో రామగుండం, ఖమ్మం జేసీ కార్యాలయాలను కూడా వెంటనే మంజూరు చేయాలని ఆయన కోరారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!