Social 1080×1350 • Multi-page
22-11-2026 BREAKING NEWS 05:14 PM
swarnodayam.com
Telugu Daily News

రేపు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం
IMG-20261120-WA0078

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
​హుజూరాబాద్, నవంబర్ 22:
హుజూరాబాద్ రూరల్ మండల పరిధిలోని 33/11 కేవీ సింగపూర్ సబ్ స్టేషన్‌లో నెలవారీ మరమ్మతు పనుల కారణంగా సోమవారం (23.11.2026) విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుందని విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
​ఈ మరమ్మతుల దృష్ట్యా మధ్యాహ్నం 03:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు హుజురాబాద్ మండలంలోని సింగపూర్, మందాడిపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయనున్నట్లు హుజూరాబాద్ రూరల్ ఆపరేషన్ ఏఈ ఎస్. రమేష్ వెల్లడించారు. ​విద్యుత్ సరఫరాలో కలిగే ఈ తాత్కాలిక అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆయా గ్రామాల ప్రజలు, రైతులు, వినియోగదారులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. మరమ్మతు పనులకు వినియోగదారులు సహకరించవలసిందిగా ఏఈ విజ్ఞప్తి చేశారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!