Social 1080×1350 • Multi-page
22-11-2026 BREAKING NEWS 07:41 PM
swarnodayam.com
Telugu Daily News

ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో హుజురాబాద్ విద్యార్థుల ప్రతిభ

ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో హుజురాబాద్ విద్యార్థుల ప్రతిభ
Oplus_16908288

—బంగారు, వెండి పతకాలతో మెరిసిన జీఎస్‌కేడీఐ కరాటే అకాడమీ క్రీడాకారులు

—విజేతలను ప్రత్యేకంగా అభినందించిన ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు

​మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, నవంబర్ 22: జాతీయ స్థాయిలో జరిగిన ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలలో హుజురాబాద్‌కు చెందిన ‘జీఎస్‌కేడీఐ (GSKDI) కరాటే అకాడమీ’ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అకాడమీ కరాటే మాస్టర్ ఎస్.కె. జలీల్ ఆధ్వర్యంలో కఠోర శిక్షణ పొందిన పలువురు చిన్నారులు, యువ క్రీడాకారులు గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించి పట్టణానికి గర్వకారణంగా నిలిచారు.

​ఆదివారం కరీంనగర్ పట్టణంలోని పొలస శారద గార్డెన్‌లో ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ ఛాంపియన్‌షిప్ పోటీలలో వివిధ రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో హుజురాబాద్ అకాడమీ విద్యార్థులు తమ సత్తా చాటుతూ పతకాల పంట పండించారు.

​బంగారు పతకాలు (గోల్డ్ మెడల్స్) సాధించిన విజేతలు:

  • ​ఎస్.కె. షాదుల్లా బాబా: 14 ఏళ్ల విభాగం, బ్లాక్ బెల్ట్ కేటగిరీ.
  • ​ఎం. భాను తేజ: 14 ఏళ్ల విభాగం, కటాస్ కేటగిరీ.
  • ​పి. సహస్ర: 15 ఏళ్ల బాలికల విభాగం, ఆల్ కలర్ బెల్ట్ (కటాస్).
  • ​సిహెచ్. సాయి అనుకృత: 5 ఏళ్ల బాలికల విభాగం, కటాస్ కేటగిరీ.
  • ​పి. నిస్సి: సబ్-జూనియర్ 9 ఏళ్ల బాలికల విభాగం, కటాస్ కేటగిరీ.
  • ​పి. కిరణ్మయి: 13 ఏళ్ల బాలికల విభాగం, కటాస్ కేటగిరీ.
  • ​ఎండి. ఉమేరా తస్లీమ్: 10 ఏళ్ల బాలికల విభాగం, గ్రీన్ బెల్ట్ (కటాస్).
  • ​ఎం.ఏ. అమన్: 8 ఏళ్ల బాలుర విభాగం, ఆల్ కలర్ బెల్ట్ (కటాస్).
  • ​ఎండి. జరసిద్దియా: 6 ఏళ్ల బాలికల విభాగం, కటాస్ కేటగిరీ (మరియు 9 ఏళ్ల బాలికల ఎల్లో బెల్ట్ విభాగంలో ప్రతిభ).

​వెండి పతకాలు (సిల్వర్ మెడల్స్) సాధించిన విజేతలు:

  • ​ఎండి. మహిన్: 9 ఏళ్ల బాలికల విభాగం, కటాస్ కేటగిరీ.
  • ​ఎండి. నాదేరా: 8 ఏళ్ల విభాగం, కటాస్ కేటగిరీ.

​ప్రముఖుల అభినందనల వెల్లువ:

జాతీయ స్థాయి పోటీలలో పతకాలు సాధించి తిరిగి వచ్చిన క్రీడాకారులను, వారికి శిక్షణ ఇచ్చిన మాస్టర్ ఎస్.కె. జలీల్‌ను పలువురు ప్రముఖులు అభినందించారు. కరీంనగర్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి (DMWO) మొహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్, 2వ వార్డు కౌన్సిలర్ సమ్రిన్ గఫర్, 17వ వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ ఖలీద్ హుస్సేన్, బీసీ జేఏసీ జిల్లా గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ విద్యార్థులను ప్రత్యేకంగా ప్రశంసించారు.

​అలాగే తెలంగాణ ఉద్యమకారుడు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా కళాకారుల సంఘం మరియు సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ విష్ణుదాసు గోపాల్ రావు, మహాత్మా జ్యోతిరావు పూలే (బీసీ వెల్ఫేర్) మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు రత్నం సార్, మాజీ పీఈటీలు రాజిరెడ్డి, సారయ్య, న్యూ కాకతీయ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ బి. రాజ్ కుమార్, ప్రిన్సిపాల్ వెంగళరావు, డైరెక్టర్ గోపాల్ తదితరులు విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించి దేశానికి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!