Social 1080×1350 • Multi-page
22-11-2026 BREAKING NEWS 11:54 PM
swarnodayam.com
Telugu Daily News

మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావును మర్యాదపూర్వకంగా కలిసిన కేటీఆర్

మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావును మర్యాదపూర్వకంగా కలిసిన కేటీఆర్
IMG-20261122-WA0128

—వినయ్ భాస్కర్, కెప్టెన్ లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ నవంబర్ 22:

హనుమకొండలో బిఆర్ఎస్ పార్టీ ఆదివారం నిర్వహించిన జన చైతన్య సభలో పాల్గొనేందుకు వచ్చిన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ అనంతరం మాజీ ఎంపీ కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావును హంటర్ రోడ్డులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కొద్దిసేపు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ తో పాటు కెప్టెన్ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. వారికి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో పాటు బిఆర్ఎస్ నేతలు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మాజీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దివ్యాంగుల సంక్షేమ సహకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి తదితరులు ఉన్నారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!