Social 1080×1350 • Multi-page
27-05-2024 BREAKING NEWS 02:51 AM
swarnodayam.com
Telugu Daily News

ఎన్ఎస్ యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రశాంత్ యాదవ్

ఎన్ఎస్ యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రశాంత్ యాదవ్
IMG-20231006-WA0106

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

హుజురాబాద్ కు చెందిన గండు ప్రశాంత్ యాదవ్ ఎన్ఎస్ యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శికి సంబంధించిన పత్రాన్ని సోమవారం ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనని జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. తన ఎంపికకు కృషి చేసిన ఎన్ ఎస్ యుఐ ఏఐసిసి ఇంచార్జ్ కన్హయ్యకుమార్, జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి, ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్, రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఫహద్, ప్రతిక్ సింగ్, జిల్లా ఇంచార్జ్ నిరంజన్, జిల్లా అధ్యక్షుడు మునిగంటి అనిల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు తనకు ప్రత్యేకంగా పరోక్షంగా సహకరించిన నియోజకవర్గ నాయకత్వానికి కృతజ్ఞుడనై ఉంటానన్నారు. తనపై నమ్మకంతో అప్పజెప్పిన పదవిని సక్రమంగా నిర్వహించి విద్యార్థులకు న్యాయం జరిగేలా పోరాడుతానని అన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!