క్యాంప్ ఆఫీసులో మారేపల్లి ప్రత్యూషను సన్మానించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ నవంబర్ 23: హుజూరాబాద్‌లోని క్యాంప్ ఆఫీసులో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్‌మెంట్ మేనేజర్ మారేపల్లి ప్రత్యూష హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించిన పలు కీలక విషయాలు, విధివిధానాలపై చర్చించటం జరిగింది.
ఇన్సూరెన్స్ అందించే సేవలు ప్రజల భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్‌మెంట్ మేనేజర్ మారేపల్లి ప్రత్యూషను ఆయన అభినందించి, ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ కూరపాటి రామచంద్రం గారు, కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి, హుజురాబాద్ (రాంపూర్).
