Social 1080×1350 • Multi-page
23-11-2026 BREAKING NEWS 06:17 PM
swarnodayam.com
Telugu Daily News

జర్నలిస్టుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి. – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి జర్నలిస్టుల వినతి

జర్నలిస్టుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి. – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి జర్నలిస్టుల వినతి
Oplus_16908288

—జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి

—ప్రభుత్వ ప్రకటనల ఆదాయంలో 10 శాతం వాటా..

—అదనంగా 3 శాతం మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించాలి

—ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి జర్నలిస్టుల వినతి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు శాశ్వత సామాజిక భద్రత కల్పించేందుకు ప్రత్యేక జర్నలిస్టుల పెన్షన్, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని కోరుతూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి జర్నలిస్టుల ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టులకు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత కల్పించే శాశ్వత వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు అనేక ప్రజా ఉద్యమాల్లో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని, అయినప్పటికీ వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే సమగ్ర పెన్షన్ విధానం లేకపోవడం ఆందోళనకరమని తెలిపారు. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే ప్రకటనల ఆదాయంలో 10 శాతం మొత్తాన్ని జర్నలిస్టుల పెన్షన్, సంక్షేమ నిధికి కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 3 శాతం మ్యాచింగ్ గ్రాంట్ అందించాలని కోరారు. ఈ నిధుల నిర్వహణకు ప్రత్యేక బ్యాంకు ఖాతా ఏర్పాటు చేసి, పారదర్శకమైన పర్యవేక్షణతో పాటు ఏటా ఆడిట్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులతో పాటు సీనియర్, రిటైర్డ్ జర్నలిస్టులకు వర్తించేలా సమగ్ర పెన్షన్ పథకాన్ని రూపొందించాలని సూచించారు. ఇందుకోసం సీనియర్ సంపాదకులు, అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. చిన్న, మధ్యతరహా, పెద్ద పత్రికలు, టెలివిజన్, ఇతర అర్హత కలిగిన మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సానుకూలంగా పరిశీలించి ముఖ్యమంత్రి, సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు శాసనసభలో జర్నలిస్టుల పెన్షన్, సంక్షేమ నిధి అంశాన్ని ప్రస్తావించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియం, స్మాల్ డైలీ అండ్ పీరియాడికల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు, టీయూడబ్ల్యూజే–143 అధ్యక్షుడు గూడూరి కొండల్ రెడ్డి, టియుడబ్ల్యూజే (ఐజెయూ) ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కామని రవీందర్, సీనియర్ జర్నలిస్టులు పరంకుశం కిరణ్ కుమార్, సురకంటి తిరుపతిరెడ్డి, నంబి భరణి కుమార్, ఎం.డి. యూసుఫ్, గోపగోని మహేష్, సిహెచ్ సత్యరాజ్, నిమ్మటూరి సాయికృష్ణ, శ్రీనివాస్, కుమార్, రాజు, టి సాగర్, ఎస్ వెంకటస్వామి, రజనీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


@@లోకల్ యాడ్స్@@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ కూరపాటి రామచంద్రం గారు, కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి, హుజురాబాద్ (రాంపూర్).

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!