Social 1080×1350 • Multi-page
23-11-2026 BREAKING NEWS 09:48 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ బస్టాండ్‌లో రెచ్చిపోయిన జేబు దొంగలు.. బస్ ఎక్కుతుండగా యువకుడి మొబైల్ కొట్టేసిన దొంగ.. – పక్కా పథకం ప్రకారం చోరీకి పాల్పడ్డ దొంగలు – రద్దీని ఆసరా చేసుకొని రెచ్చిపోతున్న దొంగలు

హుజురాబాద్ బస్టాండ్‌లో రెచ్చిపోయిన జేబు దొంగలు.. బస్ ఎక్కుతుండగా యువకుడి మొబైల్ కొట్టేసిన దొంగ.. – పక్కా పథకం ప్రకారం చోరీకి పాల్పడ్డ దొంగలు – రద్దీని ఆసరా చేసుకొని రెచ్చిపోతున్న దొంగలు
IMG-20261123-WA0117(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, నవంబర్ 23: హుజురాబాద్ బస్టాండ్ లో జేబు దొంగలు రెచ్చిపోయారు.
బస్టాండ్‌లో ప్రయాణికుడి వద్ద నుండి ఖరీదైన మొబైల్ ఫోన్‌ను దుండగులు చోరీ చేసిన ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… తాళ్లపల్లి గణేష్ అనే యువకుడు హన్మకొండ వెళ్లేందుకు ఉదయం 10 గంటల సమయంలో హుజురాబాద్ బస్టాండ్‌లో సిరిసిల్ల డిపో కు చెందిన వరంగల్ బస్సు ఎక్కుతుండగా, పక్కా రెక్కీ నిర్వహించిన ఇద్దరు దొంగలు అతని జేబులో ఉన్న సుమారు రూ. 70వేల విలువైన సాంసంగ్ ఎస్25 ప్లస్ మొబైల్‌ను అపహరించి అక్కడి నుండి పరారయ్యారు. బస్ బస్టాండ్ దాటి బయటికి వెళ్లే క్రమంలో జేబులో ఫోన్ లేకపోవడంతో వెంటనే బస్ దిగి బస్టాండ్ లో వెతికినట్లు తెలిపాడు. అక్కడ ఫోన్ దొరకక పోవడం తో దొంగతనం జరిగినట్లు నిర్దాంచుకొని, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒకరు పరిస్థితిని గమనిస్తుండగా మరొకరు చాకచక్యంగా జేబులోంచి ఫోన్ కొట్టేసినట్లు సీసీ కెమెరా ల్లో రికార్డు అయిందని పేర్కొన్నారు. బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, పోలీసులు నిఘా పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ కూరపాటి రామచంద్రం గారు, కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి, హుజురాబాద్ (రాంపూర్).

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!