Social 1080×1350 • Multi-page
23-11-2026 BREAKING NEWS 10:22 PM
swarnodayam.com
Telugu Daily News

క్లబ్ అభివృద్ధికి అందరూ సహకరించుకోవాలి. – క్లబ్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు

క్లబ్ అభివృద్ధికి అందరూ సహకరించుకోవాలి. – క్లబ్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు
IMG-20261123-WA0139

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ క్లబ్ అభివృద్ధిలో సభ్యులందరూ భాగస్వామ్యం కావాలని, సభ్యులు క్లబ్ గౌరవాన్ని పెంపొందించేందుకు క్రమశిక్షణ పాటించాలని, రాజకీయాలు క్లబ్ బయటే అలవర్చుకొని క్లబ్ నీ కట్టుబాట్లను పాటించాలని హుజురాబాద్ క్లబ్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. సోమవారం హుజురాబాద్ క్లబ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కొత్త పాలకవర్గం పదవి బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో కెప్టెన్ మాట్లాడుతూ… క్లబ్ ఈ స్థాయికి తీసుకురావడానికి సభ్యుల సహకారం, పట్టుదల కారణమన్నారు. ఎన్నో అడ్డంకులు , ఇబ్బందుల నుండి హుజురాబాద్ లో ఓ మోడల్ గా ఉన్న క్లబ్ ను కాపాడుకోవాలని అన్నారు. యువత, డాక్టర్లు, అడ్వకేట్లు అన్ని రంగాల్లో ఉన్న వారికి సభ్యత్వం కల్పించి సభ్యులను ఎక్కువ స్థాయిలో చేర్పించాలని కోరారు. అతిథి గా పాల్గొన్న
క్లబ్ అధ్యక్షులు రెవిన్యూ డివిజనల్ అధికారి నాయక్ వాడి జల కుమారి మాట్లాడుతూ… హుజురాబాద్ క్లబ్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడం గర్వకారణమని అన్నారు. పలువురు క్లబ్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ హుజురాబాద్ క్లబ్ లో అభివృద్ధి చేసిన ఘనత పూర్తిగా కెప్టెన్ వి లక్ష్మీకాంతరావుకి అంకితమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు తుమ్మల శ్రీరామ్ రెడ్డి, కంకనాల తిరుపతిరెడ్డి, కే.రామచంద్రారెడ్డి, ఇంజనీర్ సత్యనారాయణ రావు, వీ శ్రీనివాస్ రావు, క్లబ్ వైస్ ఛైర్మన్ పుల్లూరు ప్రభాకర్ రావు, కార్యదర్శి కట్కూరి మల్లారెడ్డి, శివనాథుని వేణు, గర్రెపల్లి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్, క్లబ్ సభ్యులు బండ శ్రీనివాస్, సీనియర్ సభ్యులు తోట రాజేంద్ర ప్రసాద్, కళ్లేపు మోహన్ రావు, ముచ్చ నారాయణరెడ్డి, భగవాన్ రెడ్డి, ఎర్రం నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ కూరపాటి రామచంద్రం గారు, కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి, హుజురాబాద్ (రాంపూర్).

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!