Social 1080×1350 • Multi-page
24-11-2026 BREAKING NEWS 07:15 PM
swarnodayam.com
Telugu Daily News

బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిగా దేవసాని ప్రియదర్శిని నియామకం

బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిగా దేవసాని ప్రియదర్శిని నియామకం
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజూరాబాద్ : బి.సి. సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిగా హుజూరాబాద్‌కు చెందిన దేవసాని ప్రియదర్శిని నియమితులయ్యారు. సామాజిక, రాజకీయ రంగాల్లో ఆమెకున్న అవగాహనను, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆమె చేస్తున్న నిరంతర కృషిని గుర్తించిన సంఘం అధిష్ఠానం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.
​బి.సి. సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు, సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల అయిలేష్ యాదవ్ ఈ మేరకు అధికారిక నియామక ఉత్తర్వులను జారీ చేశారు.

​చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల సాధనకు పోరాడుతా:

–దేవసాని ప్రియదర్శిని
తనపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి పదవిని అప్పగించిన జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్యకు, జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల అయిలేష్ యాదవ్‌కు దేవసాని ప్రియదర్శిని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు పుల్వేని పోచమల్లు యాదవ్, కిరణ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ముక్కెర రాజు తదితరులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. చట్టసభల్లో బీసీలకు తగిన రిజర్వేషన్లు సాధించేందుకు రానున్న రోజుల్లో ఉధృత ఉద్యమాలు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!