Social 1080×1350 • Multi-page
26-11-2026 BREAKING NEWS 08:11 PM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు హ్యుమానిటీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రోంటాల సుహాసిని చేతుల మీదుగా బెడ్‌షీట్ల పంపిణీ.

హుజూరాబాద్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు హ్యుమానిటీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రోంటాల సుహాసిని చేతుల మీదుగా బెడ్‌షీట్ల పంపిణీ.
IMG-20261126-WA0101

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ నవంబర్ 26 : హుజూరాబాద్ పట్టణాన్ని నిత్యం పరిశుభ్రంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉంచడానికి అహర్నిశలు కష్టపడుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు,ఇతర సిబ్బందికి హ్యుమానిటీ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున బెడ్ షీట్లు పంపిణీ చేశారు. పట్టణ పరిశుభ్రత కోసం వారు చేస్తున్న నిస్వార్థ సేవ ఎల్లప్పుడూ ఎంతో స్ఫూర్తిదాయకమని ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్పర్సన్ రోంటాల సుహాసిని కొనియాడారు. కార్యక్రమానికి హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రోంటాల సుహాసిని ముఖ్య అతిథిగా విచ్చేశారు.

కార్మికుల నిస్వార్థ సేవకు కృతజ్ఞతగా, వారి శ్రమకు కాస్తంత విశ్రాంతిని అందించే చిరు ప్రయత్నంగా హ్యుమానిటీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆత్మీయ కానుకగా బెడ్‌షీట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. బిలీవర్స్ చర్చి ఫాదర్ జి. నవీన్ కుమార్, కవితల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, అతిథులు మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక వస్తువు మాత్రమే కాదని, కార్మికుల సేవ పట్ల తమకున్న గౌరవానికి మరియు ప్రేమకు చిహ్నమని వారు తెలిపారు. కార్మికుల కుటుంబం ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. అలాగే, తాము కార్మికుల సేవను గౌరవిస్తామని మరియు వారి భద్రత, గౌరవం, శ్రేయస్సుకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలవడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రోంటాల సుహాసిని, కమిషనర్ కిషన్, కౌన్సిలర్లు, మున్సిపల్ పారిశుద్ధ్య సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, జవాన్లు ప్రతాప రాజు, రోంటాల సుధీర్, ఆరెల్లి రమేష్, పి అనిల్ కుమార్, తూముల కుమార్, కార్మికులు, హ్యుమానిటీ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!