Social 1080×1350 • Multi-page
28-11-2026 BREAKING NEWS 12:33 AM
swarnodayam.com
Telugu Daily News

ఖర్జూరం కవర్లో పురుగులు.. -మోర్ లో అధికారుల తనిఖీలు..

ఖర్జూరం కవర్లో పురుగులు.. -మోర్ లో అధికారుల తనిఖీలు..
IMG_20261128_001841

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్.
ఆరోగ్యానికి మేలు కలుగుతుందని కార్పొరేట్ దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేస్తే అందులో కూడా పురుగులు ఉండడంతో ఖంగు తినాల్సిన పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళితే… హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన విక్రమ్ కుమార్ హుజురాబాద్ పట్టణంలోని వరంగల్ రోడ్ లో ఉన్న మోర్ సూపర్ మార్కెట్లో ఖర్జూరాలను కొనుగోలు చేశాడు.

కాగా అందులో పురుగులు కనిపించడంతో ఆందోళన చెందిన విక్రమ్ సూపర్ మార్కెట్ వద్ద ఆందోళనకు దిగాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన భార్యకు రక్తహీనత ఉందని వైద్యులు చెప్పడంతో ఖర్జూరాలు తింటే రక్తం పెరుగుతుందని భావించి వాటిని తీసుకెళ్లాడు. అయితే రెండు బాక్సులు పూర్తయిన అనంతరం మూడో బాక్సును తెరిచి చూడగా అందులో పురుగులు కనిపించాయని అన్నారు. నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయించడం వల్ల వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న హుజురాబాద్ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ డి కిరణ్ తన సిబ్బందితో వచ్చి సూపర్ మార్కెట్ ను పరిశీలించారు. ఖర్జూరం ప్యాకెట్ లో పురుగులు ఉన్నమాట వాస్తవమైనది గ్రహించి వారిని హెచ్చరించారు. నాణ్యత లేకుండా వస్తువులను అమ్మడం సరికాదని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడద్దని అన్నారు. ఎక్స్పైర్ డేట్ పూర్తయిన తర్వాత కూడా వస్తువులను ఎలా విక్రయిస్తారని అన్నారు. ఈ విషయంపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వనున్నట్లు వారి సూచనల మేరకు జరిమానా విధిస్తామని ఆయన అన్నారు.

–వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటం!

ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి విక్రయించాల్సిన బాధ్యత వ్యాపార సంస్థలపై ఉంటుంది. ముఖ్యంగా ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాల్లో పురుగులు కనిపించడం ఆహార భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి తరచుగా మార్కెట్లపై తనిఖీలు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
***ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ

హుజురాబాద్ పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్లో ఖర్జూరాల పురుగులు వచ్చాయి అన్న సమాచారం మేరకు సరే కరీంనగర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్ రెడ్డి శుక్రవారం రాత్రి సూపర్ మార్కెట్లు సందర్శించారు. షాప్ పై వచ్చిన ఆరోపణలను పరిశీలించి పలు నాణ్యత లోపాలను ఆయన గమనించారు. వీటిని నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు.

——–+++++————-++++—————-

@లోకల్ యాడ్స్@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ పారుపల్లి కొండల్ రెడ్డి గారు, బిజెపి మండల అధ్యక్షుడు హుజురాబాద్.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!