Social 1080×1350 • Multi-page
27-05-2024 BREAKING NEWS 11:10 AM
swarnodayam.com
Telugu Daily News

ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు

ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు
IMG-20240527-WA0134

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ:

– సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది.

– ప్రతీ పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

-అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

-ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి.

– అధికారం ఉన్నవారికి.. డబ్బులు ఉన్నవారికి పోలీసులు కొమ్ముకాస్తూ.. సామాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు మాత్రం పోవటంలేదు.

-కొన్ని పీఎస్ లు ఏకంగా సెటిల్ మెంట్ల కు అడ్డాగా మారుతున్నాయి.

-లాకప్ డెత్, బెదరింపులు, వసూళ్లు, అక్రమార్కులకు అండదండగా ఉంటున్నారనే ఆరోపణలతో ఆ వ్యవస్థ పై నమ్మకం లేని పరిస్థితి నెలకొంది.

-కొన్ని స్టేషన్‌లలో మాటల్లో చెప్పలేని ఘోరాలు కూడా జరగుతున్నాయి.

-ఇలా పీఎస్ లలో జరిగేది ప్రతీదీ పారదర్శకంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో, తద్వారా సామాన్యులకు న్యాయం జరగాలనే యోచనతో పీఎస్ ల విషయంలో సుప్రీం కోర్టు జూలు విదిలించింది.

-అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల సీఎస్ లకు ఆదేశాలు జారీ చేసింది.
దీనికి సంబంధించి పనులు ఎంత వరకూ జరిగాయో తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా ఆదేశించింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!