Telugu Daily News
ఇల్లందకుంట రామాలయానికి వెలిచాల రూ. 2 లక్షల విరాళం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రంలోని అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఇటీవల ఆలయం సందర్శించినప్పుడు విరాళం ప్రకటించారు. అపర భద్రాద్రిగా పేరు గాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రూ.2 లక్షల నగదును మంగళవారం అందజేశారు.

