Social 1080×1350 • Multi-page
29-05-2024 BREAKING NEWS 08:25 AM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణ అందే శ్రీ పాటకుఆంధ్ర సంగీత దర్శకుడు యం యం కీరవాణి ఎందుకు ???

తెలంగాణ అందే శ్రీ పాటకుఆంధ్ర సంగీత దర్శకుడు యం యం కీరవాణి ఎందుకు ???
IMG-20240529-WA0122

-నంది అవార్డు గ్రహీత
అంబాల ప్రభాకర్ (ప్రభు)..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల pఅందెశ్రీ రాసినటువంటి
‘జయ జయహే తెలంగాణ
జననీ జయకేతనం కోటి గొంతికలు ఒక్కరైన చేతనం’
తరతరాల చరితగల తల్లిని రా జనం,
అనే పాటను రాష్ట్రీయ గేయంగా ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూ రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కళకారులు, నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న ఉన్నందున ఆ రోజు ప్రభుత్వ అధికారికంగా ప్రారంభించినచడానికి అందే శ్రీ రాసిన పాటకు ఆంధ్రప్రదేశ్ చెందిన ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కిర వాణి సంగీతం అందించడం భావ్యం కాదని,
తెలంగాణ ఉద్యమ సమయంలో అందే శ్రీ రాసిన పాటను నాలుగు కోట్ల ప్రజలు పాడుకున్నారని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమానికి ఎన్నో పాటలకు పురుడు పోసినటువంటి గొప్ప గొప్ప సంగీత దర్శకులు ఉండగా వారికి అవకాశం ఇవ్వకుండా ఎం ఎం కీరవానికి అవకాశం ఇవ్వడాన్ని తప్పుపట్టారు..

ఇటీవల ఆ పాటకు యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు తెలిసి ఆ పాట గేయ రచయత అందే శ్రీ కి ప్రేమ్ రాజ్ ఫోన్ మాట్లాడగా అందే శ్రీ ఆయన మాటల్లో అహంకారం తెలంగాణ రాష్ట్రంలో ఎం ఎం కీరవాణి మించిన సంగీత దర్శకుడు ఉన్నాడని ఆవేశ అహంపురిత పూరిత వాక్యాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం లో ఉన్న సంగీత దర్శకులను అవమానించేలా వివాదాస్పద వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షేమాపన చెప్పాలనీ డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో సినీ రంగంలో అనేక పాటులకు సంగీతాన్ని అందించిన సురేష్ బొబ్బిలా, బీన్స్, వందేమాతరం శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్ లాంటి ఎందరో గొప్ప గొప్ప సంగీత దర్శకులు ఉండగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యం యం కీర వాణి సంగీతం అందించడం భావ్యం కాదని,
తెలంగాణ రాష్ట్రం అనేది ఆత్మగౌరవ నినాదాలు నిదర్శనని అవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రములో ఉన్న కవి గాయని గాయకులు మేధావులు సంగీత దర్శకులు ఐక్యంగా పోరాడి ఆ పాటకు స్థానికులు సంగీతాన్ని అందిస్తూ, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతు వారికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!