Social 1080×1350 • Multi-page
29-05-2024 BREAKING NEWS 09:59 AM
swarnodayam.com
Telugu Daily News

చార్ ధామ్ యాత్రకు వెళ్ళి.. అనంత లోకాలకు… -హుజురాబాద్ కు చెందిన వ్యాపారి నార్ల కృష్ణమూర్తి మృతి..

చార్ ధామ్ యాత్రకు వెళ్ళి.. అనంత లోకాలకు… -హుజురాబాద్ కు చెందిన వ్యాపారి నార్ల కృష్ణమూర్తి మృతి..
IMG-20240529-WA0133

-హుజురాబాద్ లో విషాదం..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో ఆయిల్ మిల్ నిర్వహించే వ్యాపారి, పెద్ద పాపయ్య పల్లి గ్రామానికి చెందిన నార్ల కృష్ణమూర్తి (70) ఇటీవల సార్ ధామ్ యాత్రకు వెళ్లి అక్కడ అస్వస్థతకు గురై గుండెపోటుతో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల చార్ ధామ్ యాత్రకు చాలామంది వెళ్తున్న విషయం తెలిసిందే. బద్రీనాథ్ కేదారినాథ్ అమర్నాథ్ తదితర పుణ్యక్షేత్రాలు సందర్శించుకునేందుకు కృష్ణమూర్తి ఇతర యాత్రికులతో కలిసి ఈనెల 25వ తేదీన వెళ్లారు. కానీ అనుకొని రీతిలో అస్వస్థతకు గుండెపోటుతో గురై కృష్ణమూర్తి మృతి చెందినట్లు తెలుస్తోంది. కృష్ణమూర్తి గత 40 ఏళ్లుగా హుజురాబాద్ లో ఆయిల్ మిల్ నడుపుతున్నారు. ఆయనకు స్థానిక వ్యాపార వర్గాల్లో మంచి పేరు ఉంది. సౌమ్యనిగా, వివాదరహితునిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతితో హుజురాబాద్ లోని వ్యాపార వర్గాల్లో, ఆర్యవైశ్య సామాజిక వర్గంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. కాగా కృష్ణమూర్తికి భార్య, ఒక కుమారుడు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన పార్థీవ దేహం గురువారం ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!