Social 1080×1350 • Multi-page
29-05-2024 BREAKING NEWS 10:21 AM
swarnodayam.com
Telugu Daily News

కార్యకర్తలకు అండగా భారత రాష్ట్ర సమితి పార్టీ

కార్యకర్తలకు అండగా భారత రాష్ట్ర సమితి పార్టీ
IMG-20240529-WA0129
  • హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం వె- సైదాపూర్ మండలం వెన్నముపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త పిన్ రెడ్డి రాంరెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించగా భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన రూ. 2 లక్షల విలువైన చెక్కును నామినీగా ఉన్న ఆయన భార్య పద్మకి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, మండల బారాస పార్టి అధ్యక్షులు సోమరపు రాజయ్య, పాక్స్ అధ్య్యక్షులు బిల్ల వెంకట్ రెడ్డి, బారాస మండల ప్రధాన కార్యదర్శి చెల్మల రాజేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కయిత రాములు, నాయకుడు పోతరాజు సంపత్ పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!