Social 1080×1350 • Multi-page
30-05-2024 BREAKING NEWS 09:25 AM
swarnodayam.com
Telugu Daily News

సొంతగూటికి చేరిన ఏఐఎస్బి నేత సూర్య కిరణ్

సొంతగూటికి చేరిన ఏఐఎస్బి నేత సూర్య కిరణ్
IMG-20240530-WA0164

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:


హుజరాబాద్ పట్టణానికి చెందిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర మాజీ కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్యకిరణ్ గురువారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీలేని పోరాటాలతో ఉద్యమాలు నిర్మించి పార్టీలో విద్యార్థి విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ లో తిరిగి పని చేయడం ఆనందంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో బలమైన ఉద్యమాలు నిర్మించి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని, తనపై నమ్మకం ఉంచి మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ పెద్దలకు సూర్య కిరణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!