Social 1080×1350 • Multi-page
30-05-2024 BREAKING NEWS 10:53 AM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణ హై కోర్ట్ ప్రాంగణంలో అడ్వకెట్స్ ఇనుగాల భీమారావు, బైరి రాకేశ్, దున్న అంబేద్కర్ ల ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

తెలంగాణ హై కోర్ట్ ప్రాంగణంలో అడ్వకెట్స్ ఇనుగాల భీమారావు, బైరి రాకేశ్, దున్న అంబేద్కర్ ల ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు
IMG-20240530-WA0176

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖా మంత్రివర్యులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు తెలంగాణ హై కోర్ట్ ప్రాంగణంలో అడ్వకెట్స్ ఇనుగాల భీమారావు, బైరి రాకేశ్, దున్న అంబేద్కర్ ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గవర్నమెంట్ ప్లీడర్ మంగీలాల్, అడ్వకెట్స్ అసోసియేషన్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ శాంతిభూషణ్, నవీన్ కుమార్ ల సమక్షంలో మంత్రి శ్రీధర్ బాబు బర్త్డే కేక్ ను అడ్వకేట్స్ కట్ చేశారు. అనంతరం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డికి, న్యాయవాదులకు, సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేకంగా న్యాయవాదుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిన మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో
దుప్పటి ప్రవీణ్, రామకోటయ్య, శేఖర్ మహిళా న్యాయవాదులు శ్రీలత, సుమిత్రాదేవి, సల్మా బేగం, చంద్రశీల, లక్ష్మి, లలిత తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!