Social 1080×1350 • Multi-page
31-05-2024 BREAKING NEWS 06:08 AM
swarnodayam.com
Telugu Daily News

పదవి విరమణ ఆత్మీయ సన్మానోత్సవము….

పదవి విరమణ ఆత్మీయ సన్మానోత్సవము….
IMG-20240531-WA0042

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:

వసతి గృహ సంక్షేమాధికారి గ్రేడ్ – I జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, కరీంనగర్ గాజుల చక్రపాణి పదవి విరమణ.. సందర్భంగా…..నిరంతర కర్మశీలి క్రమశిక్షణకు మారుపేరు అకుంఠిత దీక్షా పరులు శ్రమజీవి విద్యాబోధనలో విలువలకు కట్టుబడిన వారు, వృత్తిని పవిత్రమైనదిగా నమ్మిన కర్మయోగి ప్రియాన్ని అప్రియాన్ని ఒకే విధంగా భావించేవారు. సుశిక్షితుడైన సైనికునిలా తన పని తాను చేసుకుని పోయే కర్మజీవి. విద్యా రంగంలో మూడు దశాబ్దాలకు పైగా వసతి గృహ సంక్షేమ శాఖాధికారిగా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖలో తన ప్రస్థానం ప్రారంభించి తన అమూల్యమైన సేవలు అందించి ఎందరో విద్యార్థుల జీవితంలో విజ్ఞాన జ్యోతులు వెలిగించి అందరి అభిమానాలకు పాత్రుడై తనదైన విలక్షణమైన శైలిలో ముద్రవేసి తేదీ 31- 05- 2024 శుక్రవారం రోజున పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ఆయనకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వసతి గృహ సంక్షేమ అధికారులు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!