Social 1080×1350 • Multi-page
31-05-2024 BREAKING NEWS 07:13 AM
swarnodayam.com
Telugu Daily News

పిడి రాజిరెడ్డి సేవలు వెల కట్టలేనివి..

పిడి రాజిరెడ్డి సేవలు వెల కట్టలేనివి..
IMG-20240531-WA0038
  • సన్మాన కార్యక్రమంలో పలువురు వక్తలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

ప్రజల్లో శరీరారోగ్యం పట్ల ఆసక్తిని పెంచడంలో పిడి కొన్ని రాజిరెడ్డి సేవలు వెల కట్ట లేనివని పలువురు వక్తలు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఫిజికల్ డైరెక్టర్ గా పదవీ విరమణ పొందిన కొన్ని రాజిరెడ్డికి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో విద్యార్థులకు చేసిన సేవలతో పాటు, మైదానంలో వ్యాయామం పట్ల, యోగ పట్ల ఫిట్నెస్ పట్ల ఆయన తీసుకున్న శ్రద్ధ పై పలువురు వ్యాఖ్యానించారు. అంకితభావంతో చేసే రాజిరెడ్డి లాంటి వ్యక్తులు చేసిన సేవలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హాకీ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్, హాకీ క్లబ్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్ లు తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్, ముక్క రమేష్ , అపరాధ ముత్యంరాజు, పెల్ల వెంకట్ రెడ్డి , తాళ్ల పెళ్లి రమేష్ గౌడ్ , కే నరసింహారెడ్డి, పోడిశెట్టి వెంకటరాజo, రిటైర్డ్ టీచర్ వేల్పుల రత్నం, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి గోవర్ధన్, కార్యదర్శి సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎండి మతిన్, ఎం యాదగిరి, ఏం రాజేందర్, శ్రీధర్, సోమయ్య, రవీందర్, రమేష్, జె కే ప్రభాకర్, నరసింహారెడ్డి, మాధవరావు, కోలిపాక సారయ్య, పీ శ్రీనివాస్, దశరథం, సదానందం, పంజాల శ్రీధర్ గౌడ్, టి శ్రీనివాస్, రాజు, రాజేష్, పి శ్రీనివాస్, దురై రాజు, పి రమేష్ తదితరులున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!