Social 1080×1350 • Multi-page
01-06-2024 BREAKING NEWS 01:28 AM
swarnodayam.com
Telugu Daily News

ఏఐఎస్ బి ఉమ్మడి జిల్లా కన్వీనర్ గా సూర్యకిరణ్

ఏఐఎస్ బి ఉమ్మడి జిల్లా కన్వీనర్ గా సూర్యకిరణ్
IMG-20240601-WA0112

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గా కొలుగూరి సూర్యకిరణ్ ను నియమిస్తూ అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నిష్కళంక దేశ భక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనుబంధ విభాగం ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ బలోపేతానికి క్రమశిక్షణతో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. విద్యార్థి సంఘం బలోపేతానికి విద్యారంగ సమస్యల పట్ల అలుపెరుగని పోరాటాలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ మాట్లాడుతూ సుధీర్ఘ విరామం తర్వాత మళ్లీ నా పై నమ్మకంతో నాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి పెద్దలు బండ సురేందర్ రెడ్డికి ఈ నియామకానికి సహకరించిన కరీంనగర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి తేజ్దీప్ రెడ్డికి, హకీమ్ నవీద్ కు ప్రత్యెక కృతజ్ఞతలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!