Social 1080×1350 • Multi-page
01-06-2024 BREAKING NEWS 05:06 AM
swarnodayam.com
Telugu Daily News

గంజాయి తరలిస్తూ ముగ్గురి పట్టివేత

గంజాయి తరలిస్తూ ముగ్గురి పట్టివేత
Screenshot_20240601-154350_Chrome

-70 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎంజాయ్ తరలిస్తూ ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. కరీంనగర్ వన్ టౌన్ సిఐ సరిలాల్ ఆధ్వర్యంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులోని తీగలవంతెన వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సిఫ్ట్ కారు కనిపించింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురుని అదుపులోకి తీసుకునీ విచారించగా వారిచ్చిన సమాధానం స్పష్టంగా లేకపోవడంతో అనుమానం వచ్చి కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దానిలో ఎంజాయ్ ప్యాకెట్లు కట్టి సీట్ల కింద పెట్టి పెద్ద ఎత్తున తరలిస్తున్నట్లు గుర్తించారు. సుమారు 35 ప్యాకెట్లలో ఎండు గంజాయిని కార్ వెనక సీట్ కింద దాచి ఉంచి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!