Social 1080×1350 • Multi-page
01-06-2024 BREAKING NEWS 08:34 AM
swarnodayam.com
Telugu Daily News

పురుగుల మందు తాగి యువకుని ఆత్మహత్య

పురుగుల మందు తాగి యువకుని ఆత్మహత్య
IMG-20240601-WA0187

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:


హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని అహల్యనగర్ లో నివాసం ఉంటున్న ముగ్ధంపురం అనిల్ కుమార్ (33) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కాలనీవాసులు తెలిపారు. హుజురాబాద్ లోని సూపర్ బజార్ రోడ్డులో గల కొబ్బరికాయల దుకాణంలో పనిచేస్తున్న అనిల్ కుమార్ కుటుంబ కలహాలతో క్షణికావేశంలో రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగగా ముందుగా హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ సరైన వైద్యం అందకపోవడంతో జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో వైద్యులు చేతులెత్తేయడంతో కరీంనగర్ లోని వేరొక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె కలరు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్న పిల్లలు ఇద్దరు ఉండడంతో అతని కుటుంబము పెద్దదిక్కుని కోల్పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!