Social 1080×1350 • Multi-page
02-06-2024 BREAKING NEWS 09:31 AM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాల భర్తీ : -ఎండి సజ్జనార్

తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాల భర్తీ : -ఎండి సజ్జనార్
IMG-20240602-WA0262

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీలో ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా కొత్త‌గా 2990 బ‌స్సుల‌ను ద‌శ‌లవారీగా అందుబాటులోకి తీసుకు వ‌స్తామ‌ని, అందుకు అనుగుణంగా మూడు వేల ఉద్యోగాలు త్వ‌ర‌లో భ‌ర్తీ చేయ‌నున్నామ‌ని మేనేజింగ్ డైరెక్టర్ స‌జ్జ‌నార్‌ అన్నారు.

హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వ‌ హించారు. ఈ సంద‌ర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమం లో ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు.

అనంతరం టీజీఎస్ఆర్టీసీ భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌నార్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచి పోయింద‌న్నారు.

మహాలక్ష్మి పథక అమలుకు ముందు ప్రతి రోజు సగటున 45 లక్షల మంది ప్రయాణిస్తే, ప్రస్తుతం రోజుకి సగటున 55 లక్షల మంది రాక‌పోక‌లు సాగిస్తున్నార‌ని తెలిపారు.

మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2000 కొత్త డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారిగా వాడకంలోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు.

డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలుపుకుని మొత్తంగా 2990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త బస్సులకు అనుగుణంగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని వెల్లడిం చారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!