Social 1080×1350 • Multi-page
02-06-2024 BREAKING NEWS 12:23 PM
swarnodayam.com
Telugu Daily News

హైదరాబాద్ వేడుకలకు తరలిన హుజురాబాద్ జేఎసీ నాయకులు

హైదరాబాద్ వేడుకలకు తరలిన హుజురాబాద్ జేఎసీ నాయకులు
IMG-20240602-WA0111

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు నిండిన సందర్భంగా ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు హుజురాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు ఉద్యమకారులు ఆదివారం రోజున అధిక సంఖ్యలో హైదరాబాద్ కు తరలివెళ్లారు. తమ త్యాగాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోక నిర్లక్ష్యం చేసిందని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడం హర్షణీయమని, ఇదే వైఖరిని ప్రభుత్వం కొనసాగిస్తుందని, ఉద్యమకారుల సలహాలు, సూచనలు తీసుకుని తెలంగాణ పునర్నిర్మాణం చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల జేఏసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జీ ముక్కెర రాజు, పల్కల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, పాక సతీష్, అరికిల్ల స్రవంతి, శివదయాల్ సింగ్, వేల్పుల ప్రభాకర్, ఎక్కటి సంజీవరెడ్డి, కాసు ఐలయ్య, కోటోజు జ్యోతిరాణి, వస్తాదుల సదానందం, సిరంశెట్టి శ్రీనివాస్, మట్టెల తిరుపతి, తునికి సమ్మయ్య, సంపత్, రాజిరెడ్డి, ఏం సతీష్, దశరథము తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!