Social 1080×1350 • Multi-page
03-06-2024 BREAKING NEWS 03:26 AM
swarnodayam.com
Telugu Daily News

కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు.

కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు.
IMG-20240603-WA0111

కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి

స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్:

తెలంగాణ రాష్ట్రంలో లోకసభ ఎన్నికల లెక్కింపు జూన్ 04వ తేదీ మంగళవారం నాడు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎన్నికల లెక్కింపు ప్రక్రియకు విఘాతం కలగకుండా, సజావుగా సాగేలా తీసుకునేటువంటి ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ ఆఫ్ సిఆర్.పిసి అమలు చేస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు తేదీ:04-06-2024 మంగళ వారం రోజు ఉదయం 06 గంటల నుండి తేది:05–06-2024 బుధవారంనాడు ఉదయం 06గంటల వరకు, ఒకవేళ రీ-కౌంటిగ్ జరిగితే అవికూడా ముగిసేవరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఐదుగురికి మించి గుమికూడరాదని తెలిపారు. ఏదైనా చట్టపరిధిలోని కారణంచేత సమావేశ పడవలసిన అవసరం ఏర్పడితే సంబంధిత అధికారి ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. పై ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!