Social 1080×1350 • Multi-page
04-06-2024 BREAKING NEWS 08:13 AM
swarnodayam.com
Telugu Daily News

కూటమిదే పీఠం.. బాబు ఇంట్లో సంబరాలు!

కూటమిదే పీఠం.. బాబు ఇంట్లో సంబరాలు!
IMG-20240604-WA0153

స్వర్ణోదయం ప్రతినిధి, అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమికే స్పష్టమైన ఆధిక్యం రావడంతో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలసి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్‌ తన తల్లి భువనేశ్వరిని ప్రేమగా ముద్దాడారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు విక్టరీ సింబల్‌ చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో తెదేపా 130కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. మరో 4 కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కూటమి సునామిలో అధికార వైసిపి జాడ లేకుండా కొట్టుకుపోయింది. అంతేగాక చంద్రబాబు నాయుడు ఒకే కుటుంబం నుండి ముగ్గురు చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణలు ఎమ్మెల్యేగా గెలుపొందడం, అదే కుటుంబం నుంచి పురందేశ్వరి ఎంపీగా గెలవడం మరో రికార్డ్ సృష్టించింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!