Social 1080×1350 • Multi-page
04-06-2024 BREAKING NEWS 08:31 AM
swarnodayam.com
Telugu Daily News

గెలుపు దృవీకరణ పత్రం అందుకుంటున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

గెలుపు దృవీకరణ పత్రం అందుకుంటున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
IMG-20240604-WA0165

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:

సికింద్రాబాదు లోక్ సభ నియోజకవర్గం నెంబర్ (08) లో ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరో సారి ఘన విజయాన్ని అందుకున్నారు. బిఆర్ఎస్ తరఫున స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, కాంగ్రెస్ తరపున హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేసిన అటు కిషన్ రెడ్డి గెలుపును మాత్రం ఆప  లేకపోయారు. ఈ క్రమంలోనే వరుసగా రెండో సారి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లో విజయం సాధించగా.. ఇక బిజెపికి ఇక్కడ ఇది హ్యాట్రిక్ కావడం గమనార్హం. కిషన్ రెడ్డి 4,73,012 ఓట్లు దక్కించుకున్నారు. అయితే తన ప్రత్యర్తి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ 4,23,068 ఓట్లు సాధించగా….. దానంపై 49’944 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక పద్మరావు గౌడ్ 1,29,586 ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. కాగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్ధిగా గెలుపొందిన జి.కిషన్ రెడ్డికి ఎన్నికైన ద్రువపత్రంను కౌంటింగ్ పరిశీలకులు డాక్టర్ సరోజ్ ఖాన్ సమక్షంలో రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్ అందజేశారు. ఆయన వెంట బిజెపి అగ్ర నాయకులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!