Social 1080×1350 • Multi-page
04-06-2024 BREAKING NEWS 09:04 AM
swarnodayam.com
Telugu Daily News

మాజీ సీఎం సోరెన్ భార్య ఎమ్మెల్యేగా విజయం..

మాజీ సీఎం సోరెన్ భార్య ఎమ్మెల్యేగా విజయం..
Screenshot_20240604-184829_Lokal

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ:

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా గెలుపొంది పలువురిని ఆశ్చర్యపరిచింది. రాష్ట్రంలోని గాంధే నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. తన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ పై 1,148 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎన్నికల్లో కల్పనకు 16,203 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి 15,055 ఓట్లు పొందారు. ఈ నియోజకవర్గంలో నోటాకు ఏకంగా 743 ఓట్లు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తి భార్య అనూహ్యంగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!