04-06-2024 NORMAL NEWS 09:51 AM
swarnodayam.com
Telugu Daily News
04-06-2024 09:51 AM By Mandala Yadagiri

బండి గెలుపు పట్ల హుజరాబాద్ లో కమల నాధుల సంబురాలు..

బండి గెలుపు పట్ల హుజరాబాద్ లో కమల నాధుల సంబురాలు..
IMG-20240604-WA0169

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్:

కరీంనగర్ బిజెపి పార్లమెంటు అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఘన విజయం సాధించడం పట్ల మంగళవారం రాత్రి హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో, మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామంలో బిజెపి నాయకులు సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మిఠాయిలు పంచిపెట్టారు. పటాకులు కాల్చారు 3వసారి మోదీ ప్రధాని కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు అంకతి శ్రీనివాస్, శశిధర్, గంగిశెట్టి ప్రభాకర్, రావుల వేణు, సబ్బనీ రమేష్, నరాల రాజశేఖర్, యాళ్ల సంజీవరెడ్డి, తూముల శ్రీనివాస్, సమ్మయ్య, బోర్నపల్లి గ్రామంలో మాసాడి ముత్యంరావు, నాంపల్లి సుమన్, కొండపర్తి రాజేందర్, పలువురు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!