ఢిల్లీకి పయనమైన బాబు, పవన్..

స్వర్ణోదయం ప్రతినిధి, అమరావతి:
తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వేర్వేరుగా దిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీలో వారిద్దరూ పాల్గొననున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా దిల్లీ పెద్దలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. దిల్లీ బయల్దేరే ముందు ఎన్డీయేలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా విమానంలో దిల్లీ బయల్దేరారు. ఎన్డీయే సమావేశంలో చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొననున్నారు. అంతకు ముందు జనసేన నుంచి గెలుపొందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పార్టీ కార్యాలయంలో పవన్ సమావేశమయ్యారు. వారందరికీ అభినందనలు తెలిపారు. మరింత బాధ్యతతో కలిసి పని చేయాలని సూచించారు. ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. ఇద్దరు ఢిల్లీకి ప్రయాణం కావడం హాట్ టాపిక్ గా మారింది.


